Friday: శుక్రవారం ఈ పనులు చేస్తే…పెళ్లితో పాటు లక్ష్మి దేవత ?

Friday: వివాహం కోసం కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తారు. హోమాలు కాలుస్తారు. శాంతి పూజలను నిర్వహిస్తారు. కుజ దోష నివారణ పూజలను కూడా చేసుకుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఏదో ఒక గ్రహ దోషాల కారణంగా వివాహం జరగదు. అలాంటివారు శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవిని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున శుక్ర గ్రహానికి ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది. శుక్రవారం రోజున శుక్ర గ్రహానికి పూజలు చేయడం వల్ల కొన్ని రకాల పరిహారాలు పాటించినట్లయితే వివాహాల తొందరగా జరుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. అంతే కాకుండా ఇంట్లో దీప దూప నైవేద్యాలను సమర్పించుకోవాలి. Friday

If you do these things on Friday will Goddess Lakshmi accompany you along with your wedding

లక్ష్మీదేవికి తెల్లటి పూలను సమర్పించాలి. శుక్రవారం రోజున తెలుపు లేదా లేతరంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి పేదలకు, చిన్న పిల్లలకు శనగలు, మజ్జిగ, పాలు, పెరుగు లాంటివి తప్పకుండా దానం చేయాలి. వస్త్రాలు, ఆభరణాలు, చెప్పులు కూడా ఇవ్వవచ్చు. దీని ద్వారా వివాహ సమస్యలు ఉన్నట్లయితే తొందరగా పరిష్కారం లభిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్క వద్ద దీపారాధన చేయాలి. అనంతరం విష్ణుమూర్తిని ఆరాధించాలి. దీంతో మంచి జీవిత భాగస్వామి దొరుకుతారని పురాణాల నుంచి చెబుతూనే ఉంటారు. Friday

Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000…

ఎలాంటి పూజలు అయినా కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొట్టమొదటగా వినాయకుడిని పూజించాలి. శుక్రవారం గణపతిని పూజించడం వల్ల కూడా వివాహాలు చాలా తొందరగా జరుగుతాయి. శుక్రవారం శుక్ర పరిహారాలు జపించడం చాలా మంచిది. వివాహ అడ్డంకులు ఉన్నట్లయితే తొలిగిపోతాయి. శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే వివాహాలు తొందరగా జరుగుతాయి. ఏమైనా దోషాలు ఉన్నట్లయితే తొందరగా తొలగిపోతాయి.

Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

Share your love