
Balakrishna: అవును ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే వార్త చెక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై సెటైరికల్ గా కామెంట్లు చేశారో అప్పటినుండి ఇంటర్నెట్ మొత్తం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ సైకో గాడి(జగన్ మోహన్ రెడ్డి)ని కలవడానికి నేను వెళ్ళలేదు. అలాగే ఎవడు ఆయన్ని గట్టిగా మందలించలేదు. చిరంజీవి ఏమన్నారు.. చిరంజీవి గట్టిగా అడిగితే వచ్చారా..అదంతా ఏమీ లేదు.. ఎవ్వడు గట్టిగా అడగలేదు..ఎవడు గట్టిగా అడిగారో చెప్పండి.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Balakrishna setires on Chiranjeevi
అయితే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వం లో జగన్ సినిమా వాళ్లను అవమానించారని, చర్చల కోసం పిలిచి వాళ్ళని కలవడం ఇష్టం లేక మంత్రిని పంపిస్తే చిరంజీవి వెళ్లి గట్టిగా అడగడంతో చివరికి జగన్ వచ్చారని మాట్లాడారు.ఈ ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ బాలకృష్ణ ఎవడు గట్టిగా అడగలేదని,చిరంజీవిపై సెటైరికల్ గా మాట్లాడారు. అయితే ఈ విషయంపై చిరంజీవి కూడా స్పందించి.. బాలకృష్ణ నాపై వ్యంగ్యంగా మాట్లాడడం నేను కూడా టీవీలో చూశాను. (Balakrishna)
Also Read: OG Movie: ఓజి మూవీని చేయాల్సింది ఆ మెగా హీరోనా..కానీ పవన్ కళ్యాణ్ చేతులోకి ఎలా వచ్చిందంటే.!
అలాగే ఆరోజు కలవడానికి వెళ్ళినప్పుడు బాలకృష్ణకు సమాచారం అందించాం.కానీ ఆయన వేరే పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయారు.. ఇక కరోనా కాబట్టి మేము కొంత మందిమి జగన్ ని కలవడానికి వెళ్ళాము.అలాగే అక్కడికి వెళ్లాక జగన్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకే మేము అక్కడికి వెళ్ళాం అంటూ బాలకృష్ణకి కౌంటర్ వేశారు..

ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన మాటలకు చిరంజీవి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే అసెంబ్లీలో పవన్ ఉంటే చిరంజీవిపై సెటైరికల్ గా మాట్లాడగలరా..ఎవడు అడగలేదు..ఎవడు అడిగారు చెప్పండి అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉంటే మీకు సరైన సమాధానం ఇచ్చేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో.(Balakrishna)





