
OG Movie: పవన్ కళ్యాణ్.. ఈయనకి ఏ క్షణాన ఈ పేరు పెట్టారో కానీ ఆ పేరులోనే తెలియని ఒక స్టైల్ ఉంది.. పేరుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా తన మేనరిజంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయ రంగంలో తనకు ఎదురులేదు అనిపించుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలో నటించినా కానీ తన స్టైల్, నటన చాతుర్యమే తనకు హిట్ అందిస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఎప్పుడైనా సరే కొత్త డైరెక్టర్లకు ఆఫర్ ఇస్తూ ఉంటారు.
Is that the mega hero who should do the OG Movie
అయితే తాజాగా ఆయన సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాతో మన ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటనతో మెప్పించిందని చెప్పవచ్చు. ఇక వీళ్లే కాకుండా ఇందులో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అలాంటి ఈ చిత్రంలో ముందుగా పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకోలేదట. అయితే ఈ సినిమా కథను ముందుగా వేరే హీరోలకు వినిపించారట డైరెక్టర్. మరి ఆ హీరోలు ఎవరో ఆ వివరాలు చూద్దాం.(OG Movie)
Also Read: OG Movie: ఓజి మూవీలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న రష్మిక ప్రియుడు.!
మొదటిగా సుజిత్ ఈ సినిమా కథని హీరో వరుణ్ తేజ్ కి వినిపించారట. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల సినిమా రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత రానా దగ్గుబాటికి వినిపించారట. కానీ ఆయన కూడా రిజెక్ట్ చేయడంతో చివరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కథ మొత్తం వినిపించారట. ఇది విన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓకే చేయడంతో సినిమా స్టార్ట్ అయి కొన్ని సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది.

దీనికి కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకకపోవడమే. ఎలాగోలా చివరికి సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు సుజిత్. చివరికి ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి చూడాలి ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో ఏమైనా రికార్డులు సృష్టిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది..(OG Movie)





