KCR: BRS లోకి ఈటల, విజయశాంతి.. మరి కొంతమంది ఉద్యమకారులు ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గారెంటీలు… విఫలమయ్యాయని గులాబీ పార్టీ జనాల్లోకి గట్టిగానే దూసుకు వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు… కాస్త ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ… నేతలు ప్రతి అంశాన్ని జనాల్లోకి తీసుకు వెళ్తున్నారు. దీంతో.. జనాల్లో కేసీఆర్ అంటే అభిమానం మళ్ళీ పెరుగుతోంది.గతంలో ఓడించిన ప్రజలే ఇప్పుడు మళ్లీ కెసిఆర్ సారు కావాలి అంటున్నారు.KCR

etela rajender vijayashanthi may meets KCR

సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో కెసిఆర్ పార్టీలోకి ఉద్యమకారులు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిజెపి పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ఇద్దరు కూడా కేసీఆర్ ను కలవబోతున్నారట. వీళ్లతో పాటు మరికొంతమంది ఉద్యమకారులు కూడా కేసీఆర్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. KCR

Also Read: Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్…

గులాబీ పార్టీలోకి ఈటల రాజేందర్ వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. అటు పార్లమెంటుకు విజయశాంతిని పంపేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఆంధ్ర వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్నారన్న నేపథ్యంలోనే ఈ ఇద్దరు బడా లీడర్లు కేసీఆర్ వద్దకు వస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ జెండా ఎగరడం మరోసారి ఖాయమని అంటున్నారు. KCR

Also Read: Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?

Share your love