Kavitha: కల్వకుంట్ల కవిత పార్టీలోకి ఈటల రాజేందర్?

Eatala Rajender kavitha
Eatala Rajender kavitha
Eatala Rajender kavithaEatala Rajender kavitha

Kavitha: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారతీయ జనతా పార్టీలో ఉంటున్న ఈటల రాజేందర్ చాలా రోజులుగా మౌనంగా ఉన్నారు. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ పెరగడంతో… ఈటల బయటకు వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. Kavitha

Eatala Rajender into kavitha party

మళ్లీ కేసీఆర్ పార్టీలోకి వెళ్తారని మొన్నటి నుంచి ప్రచారం కూడా మొదలైంది. మా బాస్ కెసిఆర్ అంటూ ఈటల రాజేందర్ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానించారు. దీంతో ఘర్ వాపస్ కార్యక్రమానికి ఈటల రాజేందర్ శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగించింది గులాబీ సోషల్ మీడియా. అయితే అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఈటల రాజేందర్ , సింహం సవారి చేసేందుకు సిద్ధమయ్యాడట. Kavitha

Also Read: Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. జనసేన సంచలన నిర్ణయం ?

కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట ఈటల రాజేందర్. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్, కల్వకుంట్ల కవిత పార్టీలోకి వెళితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. పార్టీ ఫండ్ పెట్టేందుకు ఈటల రాజేందర్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. కల్వకుంట్ల కవిత పార్టీలోకి వెళ్తే ఇటు కేసీఆర్ తో పాటు బిజెపిని దెబ్బ కొట్టవచ్చని ఈటల భావిస్తున్నారట. Kavitha

Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెర‌పైకి కొత్త పంచాయితీ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu