
Etela Rajender : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ కెసిఆర్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశం అయ్యారట. Etela Rajender
Etela Rajender met harish rao over BRS
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ ఆటలు సాగనివ్వకుండా బండి సంజయ్ కుమార్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈటల రాజేందర్ అభ్యర్థులు ఓడిపోయేలా బండి సంజయ్ ప్లాన్ వేశారట. దీంతో ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలో ఘోర అవమానం ఎదురైనట్లు ప్రచారం సాగింది. Etela Rajender
Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ
దీంతో బహిరంగంగానే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బండి సంజయ్ పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావుతో ఈటల రాజేందర్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అందరూ సంక్రాంతి సంబరాలలో మునిగి తేలగా… ఈ ఇద్దరు మాత్రం ఫామ్ హౌస్ లో రహస్యంగా సమావేశం అయ్యారట. ఇదంతా కేసిఆర్ కు తెలిసే జరిగిందని టాక్ నడుస్తోంది. Etela Rajender
Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్





