Etela Vs Bandi Sanjay: బండి సంజయ్ పీఆర్వో పోస్టుల వివాదం..ఈట‌ల స్ట్రాంగ్ వార్నింగ్ ?

Etela Vs Bandi Sanjay
Etela Vs Bandi Sanjay
Etela Vs Bandi Sanjay

Etela Vs Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కావాలని ఈటెల రాజేందర్ ను తొక్కేస్తున్నాడని ప్రచారం జోరు అందుకుంది. ఉమ్మడి కరీంనగర్లో తనకంటే పెద్ద లీడర్ ఈటల రాజేందర్ అవుతాడని మొదటి నుంచి అతన్ని అణచివేసే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నట్లు ప్రచారమైతే సాగుతోంది. Etela Vs Bandi Sanjay

Etela Vs Bandi Sanjay controversy in huzurabad

అందుకే ఈటెల రాజేందర్ మల్కాజిగిరి కి వచ్చి ఎంపీగా పోటీ చేశారట. హుజురాబాద్ ను వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జోరు అందుకుంది. అంతేకాదు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ చాలా ప్రయత్నాలు చేశారట. కానీ బండి సంజయ్ దాన్ని ఆపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు బడా లీడర్ల మధ్య వార్ తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిఆర్ఓ పోస్టుల వివాదం కారణంగా మరోసారి ఈటల రాజేందర్ చాలా సీరియస్ అయ్యారు. Etela Vs Bandi Sanjay

Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవ‌మానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?

కమలాపురం మండలం పంగిడి పాల్గాలి సర్పంచ్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి వలిగే కళ్యాణి అలియాస్ సాంబరావు కోడలు విజయం సాధించింది అని బండి సంజయ్ పిఆర్ఓ పోస్ట్ పెట్టారు. అలాగే తన సమీప ప్రత్యర్థి ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థిపై 300 ఓట్లకు పైగా తేడాతో కళ్యాణి విజయం సాధించినట్లు ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి పోస్ట్ పెట్టారట. ఈ పోస్ట్ చూసిన ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన ఉన్నవాళ్లు అలాంటి పోస్టులు పెడతారా అని నిలదీశారు. తాను ఏ పార్టీలో ఉన్నానని ప్రజలే తేల్చుకుంటారని వివరించారు. ఎన్నికల తర్వాత అన్ని వివరిస్తానని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. Etela Vs Bandi Sanjay

Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీల‌లు…ఫోటో వైర‌ల్ ?

Leave a Comment