Sathya Raj: హీరోలను నెత్తిన పెట్టుకోకండి.. సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు..ఆ హీరోని ఉద్దేశించేనా.?

Sathya Raj controversial comments

Sathya Raj: తమిళనాడు రాజకీయాలు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సినీనటులే.. ఎప్పటినుంచో ఇక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఈ సినిమా స్టార్లు..అలాంటి ఈ తరుణంలో ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలు ప్రస్తుతం టీవీకే పార్టీ స్థాపించిన దళపతి విజయ్ వరకు సినీ ఫీల్డ్ లో అనుబంధం ఏర్పరచుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలు స్థాపించి అధికారంలోకి వచ్చారు.. అలాంటి ఈ టైంలో తమిళ నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి సత్యరాజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు..

Sathya Raj controversial comments

ఈ మధ్యకాలంలో ఆయన చాలావరకు పొలిటికల్ సెటైర్లు వేస్తూ జనాల్లో హల్చల్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన అన్నమాట కొంతమంది నటులను నొప్పించేలా ఉంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. నటులను నెత్తిన పెట్టుకొని ఉరేగడం మానుకోండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇలా మాట్లాడడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి..సత్యరాజ్ రాజకీయాల పైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.. (Sathya Raj)

Also Read: Hema: నాగార్జున మా అమ్మాయి ఫంక్షన్ కి వస్తే వెళ్లగొట్టాను.. హేమ షాకింగ్ కామెంట్స్.!

నటీనటులను తలపై పెట్టుకుని ఊరేగడం మానేయండి. వాళ్లకు అన్ని విషయాలు తెలుసని అనుకోకండి. నటించడం మాత్రమే వాళ్లకు తెలుసు. సమాజంలో జరుగుతున్న తప్పులు వారికి ఏమీ తెలియవు. పేదవారి కష్టాలు కూడా వారు దగ్గర నుంచి చూసి ఉండరు. వాళ్లేం ఐన్ స్టిన్, అంబేద్కర్, పెరియార్ లాగా గొప్ప వ్యక్తులు కాదు. కేవలం దర్శకులు ఏది చెబితే అది అనుసరించే మామూలు వ్యక్తులంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ పోస్ట్ ఒక హీరోని టార్గెట్ చేస్తూ చేసినట్లుగా ఉంది.

Sathya Raj controversial comments

అయితే దీనిపై ప్రముఖ దర్శకుడు పెరారసు స్పందించారు. ఎంజీఆర్ ఉన్న సమయంలో కూడా ఇలా మాట్లాడే ధైర్యం మీకు ఉండేదా? పార్టీ కోసం శ్రమ పడివారిని పక్కన పెట్టి సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారంటూ విమర్శించారు. నటన అనేది కేవలం వృత్తి మాత్రమే.వారిలో ప్రపంచ జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉన్నారని తెలియజేశారు. ఈ విధంగా సత్యరాజ్ నటులను చులకన చేసి మాట్లాడడం బాగాలేదని ఇన్ డైరెక్ట్ గా చురకలాంటించారు.(Sathya Raj)

Share your love