Custard Apple: చ‌లికాలం వ‌చ్చేసింది..సీతాఫలం తింటున్నారా, అయితే ఇవి ముందుగా తెలుసుకోండి ?

Custard Apple: సీతాఫలం ఇది కేవలం సీజన్ సమయంలో మాత్రమే దొరుకుతుంది. చలికాలంలో మాత్రమే సీతాఫలం మార్కెట్లలో లభిస్తుంది. అంతేకాకుండా పల్లెటూర్లలో ఇంటి వద్ద చాలా వరకు సీతాఫలం చెట్లు ఉంటాయి. కానీ అవి సంవత్సరం పొడవున పండ్లు రావు. కేవలం చలికాలం సీజన్లో మాత్రమే సీతాఫలం కాస్తుంది. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, పోషకాలు అధికంగా ఉంటాయి. సీతాఫలం తినడం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సీతాఫలం ఎంతగానో సహాయం చేస్తుంది. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. Custard Apple

Custard Apple Benefits

ఇది శరీరంలో ఉండే మలబద్దకాన్ని పెంచుతోంది. సీతాఫలంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే రక్తపోటు సమస్యలను నియంత్రిస్తాయి. సీతాఫలంలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటి సమస్యలతో బాధపడేవారు సీతాఫలం తిన్నట్లయితే చాలా మంచిది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారు చేస్తాయి. సీతాఫలం తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం సీతాఫలం తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది ఎంతో తియ్యగా ఉంటుంది. తిన్న కొద్ది తినాలి అనిపిస్తుంది. ఈ పండుకు మార్కెట్లలో చాలా డిమాండ్ ఉంటుంది. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సీతాఫలంలో ఉండే పోషకాలు శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నివారించడంలో సహాయం చేస్తాయి. సీజన్లో మాత్రమే అధికంగా లభించే ఈ పండును వీలైనంతవరకు తింటూ ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అధికంగా సహాయం చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అని డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ పండును తినకూడదని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం అధికంగా తిన్నట్లయితే అసలు మంచిది కాదు. ఇందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. Custard Apple

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తిన్నట్లయితే వారి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు రెట్టింపు అవుతాయి. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును తినకపోవడమే మంచిది. వారంలో ఒకటి లేదా రెండు తింటే ఎలాంటి సమస్యలు రావు కానీ అధికంగా ఉన్నాయని ఎక్కువగా తిన్నట్లయితే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. వీలైనంతవరకు డయాబెటిస్ పేషంట్లు ఈ పండుకు దూరంగా ఉండటమే మంచిది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ పండును తినకూడదు. ఎందుకంటే సీతాఫలంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది బరువును అధికంగా పెంచుతాయి అంతేకాకుండా సీతాఫలంలో కొవ్వు శాతం ఆదికంగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఈ పండును తిన్నట్లయితే వారి శరీరంలో కొవ్వు స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దానివల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు నియంత్రణలో ఉండాలని అనుకునే వారు మాత్రం ఈ పండుకు దూరంగా ఉండటమే మంచిది.

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

Share your love