
Custard Apples: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం పండు ఒకటి. ఈ పండ్లు సాధారణంగా శీతాకాలంలో కాస్తాయి. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సీతాఫలం పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి6, బి12 లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బలహీనంగా ఉన్నట్లయితే సీతాఫలం తిన్నట్లయితే తక్షణమే శక్తి లభిస్తుంది. Custard Apples
Surprising Benefits of Custard Apple
శరీరం అలసటగా, నీరసంగా ఉన్న సమయంలో సీతాఫలం తినడం చాలా మంచిది. సీతాఫలంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇది కండరాలకు బలాన్ని అందిస్తుంది. సీతాఫలం గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ పండ్లు తిన్నట్లయితే గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. సీతాఫలం తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. సీతాఫలం తినడం వల్ల గుండెకు వేగంగా రక్త సరాఫరా జరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శీతాఫలం తిన్నట్లయితే ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు ఆహారం వేగంగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తాయి. సీతాఫలం తినే సమయంలో కొంతమంది పొరపాటున ఈ పండు విత్తనాలను మింగేస్తూ ఉంటారు. Custard Apples
Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు…
అయితే ఇలా చేయడంవల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సీతాఫలం విత్తనాలు పొరపాటున మింగినట్లయితే గొంతులో ఇరుక్కుని సమస్యలు ఎక్కువగా వస్తాయి. సీతాఫలం విత్తనాలు తినడం వల్ల కంటి దృష్టి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. పొరపాటున కూడా ఈ పండు విత్తనాలను తినకుండా జాగ్రత్తలు వహించాలి. సీతాఫలం గింజలు పొరపాటున మింగినట్లయితే అసలు మంచిది కాదు. సీతాఫలం గింజలు పొరపాటున మింగినట్లయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా కష్టమవుతుంది. దానివల్ల కడుపునొప్పి లాంటి సమస్యలు అధికమవుతాయి. చిన్నపిల్లలు పొరపాటున కూడా సీతాఫలం విత్తనాలను మింగకూడదు. వారికి ఈ విత్తనాలు గొంతులో అడ్డుపడతాయి. దానివల్ల ఊపిరి తీసుకోలేకపోతారు. అనేక రకాల సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ పండు తినే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా మంచిది. Custard Apples
Also Read: CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్, సోనియా శుభాకాంక్షలు చెప్పలేదా…

