Raw Banana: పచ్చి అరటి పండ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Raw Banana: పండ్లలో అరటి పండుకు ప్రత్యేకమైన స్థానం కలదు. ఎన్నో రకమైన పండ్లు మార్కెట్లలో లభించినప్పటికీ అరటి పండు తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఇది ఎంతో రుచిగా, తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అరటిపండు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు సంవత్సరం పొడవున దొరుకుతుంది. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఫొలేట్, ఫైబర్, విటమిన్ సి, బి6 ఉంటాయి. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలు, ముసలి వారు కూడా అరటిపండును చాలా సులభంగా తినగలుగుతారు. Raw Banana

Health Benefits of Raw Banana and its Nutritional Value

ఇక అరటిపండు మాత్రమే కాకుండా చాలామంది పచ్చి అరటికాయను కూడా చాలామంది తింటూ ఉంటారు. పచ్చి అరటికాయలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చి అరటికాయతో కూరను కూడా వండుకుంటారు. చిప్స్ కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. పచ్చి అరటికాయను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ పచ్చి అరటికాయలను నేరుగా తినలేము. దానితో ఏదో ఒక వంటకం చేసుకొని మాత్రమే తినగలుగుతాము. చాలామంది సాంబార్ కూడా పచ్చి అరటికాయతో చేసుకుంటారు. అంతేకాకుండా బోండాలు, బజ్జీలు కూడా పచ్చి అరటికాయతో చేసుకొని తింటూ ఉంటారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పచ్చి అరటికాయలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం, బి6, విటమిన్ సి, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అరటి పండులో ఉండే పోషకాలు అన్ని పచ్చి అరటికాయలో ఉంటాయి. పచ్చి అరటికాయ తినడం వల్ల బరువు నిర్వాహణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయను తినడం వల్ల ఆకలి మందగిస్తుంది. Raw Banana

Also Read: YS Bharathi: జగన్ షాకింగ్ నిర్ణయం… సీఎంగా వైయస్ భారతి?

దాని వల్ల వేగంగా బరువు తగ్గుతారు. పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పచ్చి అరటి కాయలో ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి అరటికాయలో పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. పచ్చి అరటికాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మూత్రపిండాల సమస్యలను నివారిస్తాయి. పచ్చి అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను అందిస్తుందని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు పచ్చి అరటికాయ కూడా తినాలని చెబుతున్నారు. Raw Banana

Also Read: EGG: గుడ్డు పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా ?

Share your love