
Harshit Rana: టీమిండియా స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గురించి తెలియని వారు ఉండరు. టీమిండియాలో పర్మనెంట్ ప్లేయర్గా హర్షిత్ రానా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ కోచ్ ఉన్న నేపథ్యంలో అతనికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక రక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో హర్షిత్ రానా మరో వివాదంలో చిక్కుకున్నారు. హర్షిత్ రానా తాజాగా ఓ ప్రత్యేక కారులో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్ కోసం వచ్చాడు. Harshit Rana
Harshit Rana arrives at Gautam Gambhir’s team dinner in swanky BMW
టీమిండియా ప్లేయర్లు వరుసగా సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలో వాళ్లందరికీ రిలాక్స్ ఇచ్చేందుకు గౌతమ్ గంభీర్ డిన్నర్ పార్టీ ఇచ్చారు. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రేపటి నుంచి టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగనుంది. అంటే టీమిండియా ప్లేయర్లు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో నిన్న బుధవారం రాత్రి టీమిండియా ప్లేయర్లను తన ఇంటికి పిలిపించుకున్నాడు గౌతమ్ గంభీర్. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లకు ఢిల్లీలోని తన నివాసంలోనే డిన్నర్ పార్టీ ఇచ్చాడు. Harshit Rana
Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
ఈ డిన్నర్ పార్టీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులో టీమిండియా ప్లేయర్లందరూ వచ్చారు. కానీ హర్షిత్ రానా మాత్రం పెద్ద తోపులాగా ఓ కారులో దిగాడు. అతని ఇల్లు కూడా ఢిల్లీలోనే ఉంది. అందుకే ఇంటి నుంచి నేరుగా గౌతమ్ గంభీర్ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీమ్ ఇండియా ప్లేయర్లతో పాటు కాకుండా ప్రత్యేక కారులో వచ్చాడు. దీంతో అతన్ని సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు జనాలు. నువ్వు పెద్ద తోఫా అంటూ ఫైర్ అవుతున్నారు. Harshit Rana
Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?




















