Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత‌ బొంతు రామ్మోహన్.. సరైన నాయకుడు లేక ?

Jubilee Hills by-election: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఈ ఉప ఎన్నికకు ఉంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించారు కేసీఆర్. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అవకాశం ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

Jubilee Hills by-election Congress leader Bonthu Rammohan is the BJP candidate for Jubilee Hills

ఇక రెండు రోజుల కిందట నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీసీ బిడ్డ అన్న నినాదంతో నవీన్ యాదవ్ కు అవకాశం కల్పించారు. అయితే బిజెపి మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇంకా ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తమ పార్టీలో సరైన నాయకుడు లేడని సంకేతాన్ని ఇస్తూ బొంతు రామ్మోహన్ పేరును వెల్లడించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. Jubilee Hills by-election

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

ప‌క్కా పార్టీ లీడ‌ర్ ను ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని అంద‌రూ వాపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తిని, అతనికి ఏబీవీపీ బ్యాక్ గ్రౌండ్ ఉందని వెల్లడించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ ను పార్టీ లోకి తీసుకొని టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఈ అంశంపై బొంతు రామ్మోహన్ వెంటనే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో హ్యాపీగా ఉన్నానని ఏ పార్టీలోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. అయితే బిజెపి నేరుగా ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో మరో వారం రోజుల్లో బొంతు రామ్మోహ‌న్‌ మనసు మార్చుకుంటే కచ్చితంగా బిజెపి అభ్యర్థి అవుతాడని కొంతమంది వాదిస్తున్నారు. Jubilee Hills by-election

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

Share your love