Bath: ఇలా స్నానం చేస్తే, ల‌క్ష్మీ దేవి కురుస్తుంద‌ట‌…!

Bath: మానవులు ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే తక్షణం చేసే పని స్నానం చేయడం. ఉదయం లేచి కాల కృత్యాలు తీర్చుకొని పళ్ళు తోముకొని వెంటనే స్నానం చేస్తారు. స్నానం చేయడంవల్ల అలసట తీరిపోతుంది. బద్ధకం, నీరసం సమస్యలు తీరిపోతాయి. స్నానం తప్పకుండా ఉదయం లేచిన వెంటనే చేయాలి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటించినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజున స్నానం చేసే నీటిలో కాచిన పాలు కలిపి స్నానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాచిన పాలు వేడి నీటిలో పోసుకొని స్నానం చేయడం వల్ల మానసిక శాంతి, దీర్ఘాయువు కలుగుతాయి. Bath

Benefits of a Bath for Human

మంగళవారం రోజున స్నానం చేసే వేడి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేయాలి. అలా చేయడం వల్ల గతంలో వాయిదా పడిన పనులు అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే నెగెటివిటీ వెళ్లిపోతుంది. బుధవారం రోజున స్నానం చేసే నీటిలో కొన్ని ఏలకులు కలిపి స్నానం చేయాలి. అలా చేయడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. గురువారం రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది. శుభ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. Bath

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

దీనిని వేడి నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా అంతా నశిస్తుంది. శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో గులాబీ రెక్కలు లేదా గులాబీ నీరు వేసుకొని స్నానం చేయాలి. అలా చేయడం వల్ల అందం పెరుగుతుంది. ప్రేమ, ఆకర్షణ కలుగుతాయి. శనివారం రోజున స్నానం చేసే ముందు ఆవ నూనె శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. చేసే పనిలో అడ్డంకులు ఉండవు. దరిద్రం తొలగిపోతుంది. అనారోగ్యం నశిస్తుంది. ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో చందనం లేదా గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆత్మశుద్ధి పెరుగుతుంది. వారం రోజులపాటు ఇలాంటి నియమాలను పాటించినట్లయితే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, ఇంటికి చాలా మంచిది. Bath

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

Share your love