

Rammohan Naidu: ఇండిగో యాజమాన్య తీరు కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి గండం వచ్చింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 లక్షల విమానాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో విమానాశ్రయాలు కాస్త బస్టాండు లాగా మారిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాలలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Rammohan Naidu
Should Rammohan Naidu Resign For Indigo Flight Crises
ముందస్తు ప్రకటన చేయకుండానే తమ విమానాలను ఆపేసింది ఇండిగో. దీనివల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పిన రూల్స్ పాటించని ఇండిగో, ఉద్యోగులపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే లక్షలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఉన్నప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలాంటి భరోసా కల్పించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Rammohan Naidu
Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?
అటు మోడీ ప్రభుత్వం కూడా తప్పిదం మొత్తం రామ్మోహన్ నాయుడు పైకి తోసే ప్రయత్నం చేస్తుందట. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అతనితో రాజీనామా చేయించేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇండిగో దెబ్బకు రామ్మోహన్ నాయుడు కెరీర్ క్లోజ్ అన్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి రామ్మోహన్ నాయుడుకు ఈ శాఖ పైన అవగాహన లేదు. కొత్తగా కేంద్రమంత్రి అయ్యాడు. అలాంటి వాడికి ఏదో చిన్న శాఖ ఇవ్వాలి కానీ, ఏవియేషన్ శాఖ ఇచ్చే మోడీ పరువు పోయిందని అంటున్నారు. Rammohan Naidu
Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?







