
Ravi Teja: ఏంటి స్టార్ హీరో రవితేజను ఆ దర్శకుడు బ్లాక్మెయిల్ చేశారా..ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తానని బెదిరించారా..ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న మాస్ జాతర సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 31న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.
The director threatened Ravi Teja
ఈసారి మాత్రం సినిమాని పక్కా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ..నేను మొదట ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చాను.కానీ హీరోగా అవకాశాలు రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను.(Ravi Teja)
Also Read: Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇది కదా పుష్ప గాడి రేంజ్…
ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న సమయంలో కృష్ణవంశీ సింధూరం సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది.అయితే అప్పుడు నిన్నే పెళ్లాడతా సినిమా షూటింగ్ జరుగుతుంది.ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా సినిమా షూటింగ్లో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు.కానీ నేను మాత్రం నో చెప్పాను.

దాంతో కృష్ణ వంశీ నువ్వు ఈ సినిమాలో నటిస్తావా లేక సింధూరం సినిమా నుండి నిన్ను తీసేయనా అని బెదిరించారు.ఇక చేసేదేమీ లేక నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించాను. ఆ తర్వాత సింధూరం సినిమాలో నన్ను తీసుకున్నాడు అంటూ కృష్ణవంశీ బ్లాక్మెయిల్ చేసిన విషయాన్ని బయట పెట్టారు రవితేజ.(Ravi Teja)





