Sandeep Reddy Vanga: సినీ కెరీర్ లో ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగా ఈగోని హార్ట్ చేసిన హీరో..దెబ్బకి హడల్.!

The hero who made Sandeep Reddy Vanga ego heart

Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకి ఒక్కొక్కరికి ఒక్కొరకమైన ప్రత్యేకత అనేది ఉంటుంది. వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకరు.ఈయనకి ఆర్జీవికి అప్పట్లో ఎలాంటి ప్రత్యేకత అయితే ఉండేదో ఇప్పుడు ఈయనకి కూడా అలాంటి ప్రత్యేకతే ఉంటుంది.చేసినవి తక్కువే సినిమాలో అయినప్పటికీ ఆ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇండియన్ సినీ హిస్టరీలో డైరెక్టర్ గా ఈయన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా గుర్తింపు సంపాదించారు.

The hero who made Sandeep Reddy Vanga ego heart

అయితే అలాంటి సందీప్ రెడ్డి వంగా తాను డైరెక్షన్ చేసే సినిమా విషయంలో ఎంత అద్భుతంగా డెడికేట్ అయి ఉంటారో కోపం వస్తే అంత ఎక్కువగా ఫైర్ అవుతారట. అయితే అలాంటి సందీప్ రెడ్డి వంగా ఈగోని ఓ హీరో హర్ట్ చేసారట.ఆ హీరో చేసిన పనికి సందీప్ రెడ్డి వంగా షూటింగ్లోనే ఇచ్చి పడేసారట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే విజయ్ దేవరకొండ..(Sandeep Reddy Vanga)

Also Read: Allu Arjun: ఒక్క మాటతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇచ్చి పడేసిన సాయి దుర్గ తేజ్.. మెగా…

అర్జున్ రెడ్డి మూవీతో యావత్ ప్రపంచాన్ని విజయ్ దేవరకొండ వైపు చూసేలా చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండపై మండిపడ్డారట.ముఖ్యంగా డిఫరెంట్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు ఈ సినిమా స్టోరీ విని చాలామంది హీరోలు సైతం రిజెక్ట్ చేశారు. అలాంటి స్టోరీ విజయ్ దేవరకొండ ఒప్పుకున్నారు. కానీ ఆయనలో ఏదో ఒక మూలన డౌట్ అయితే ఉండేదట.

The hero who made Sandeep Reddy Vanga ego heart

ఈ సినిమా చేస్తున్నాం కానీ వర్కౌట్ అవుతుందా సినిమాని ప్రేక్షకులు చూస్తారా అని ప్రతిసారి షూటింగ్లో అడిగేవారట. అయితే ఏదైనా పనిచేసేటప్పుడు ముందు మనం దానిపై నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం లేకుండా ముందుకు వెళ్లడం వేస్ట్ అని విజయ్ దేవరకొండ కి షూటింగ్లోనే వార్నింగ్ ఇచ్చారట సందీప్ రెడ్డివంగా. అలా తన ఇగో హర్ట్ చేయడంతో విజయ్ కి కౌంటర్ ఇవ్వడంతో ఆ తర్వాత సినిమాపై నమ్మకం పెట్టుకొని అర్జున్ రెడ్డి మూవీ ని ఫినిష్ చేశారు.ఇక ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకాదరణ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు.(Sandeep Reddy Vanga)

Share your love