
Gautam Gambhir: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు అక్టోబర్ 15న ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎక్కనుంది. సిరీస్ ప్రారంభానికి ముందే, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శుభ్‌మన్ గిల్ కొత్త వన్డే కెప్టెన్‌గా అర్హత పొందాడని స్పష్టంగా ప్రకటించారు.
Gautam Gambhir supports Shubman Gill leadership
గంభీర్ మాట్లాడుతూ, “గిల్ కష్టపడి పని చేశాడు, అన్ని ప్రమాణాలను చేరుకున్నాడు. అతను కెప్టెన్సీకి పూర్తిగా eligible. ఒక కోచ్‌గా, ఒక ఆటగాడు సరైన decisions తీసుకుంటే, సరైన approach కలిగి ఉంటే, ముందుండి టీమ్‌ను నడిపిస్తుంటే ఇంకా ఏమి అడగాలి?” అని తెలిపారు. అయితే, ఈ బాధ్యత గిల్‌కు challenging కాబట్టి, ప్రెషర్ ఉన్నదని గంభీర్ స్పష్టం చేశారు.
గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటికే కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించింది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ Draw చేసుకోగలిగింది. తాజాగా, వెస్టిండీస్ సిరీస్‌లో 2-0 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ అనుభవం గిల్ నాయకత్వ నైపుణ్యాలను బలపరుస్తుంది.
ఆస్ట్రేలియా పర్యటన గిల్ కెప్టెన్సీలో Debut అవుతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టం కాబట్టి ఈ సిరీస్ అతనికి కఠినమైన పరీక్ష అవుతుంది. గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వంటి సీనియర్లు సపోర్ట్ చేస్తారని, గిల్ కు సలహాలు, అనుభవం అందుతుందని తెలిపారు. అయినప్పటికీ, ఆసియా కప్‌లో తెల్ల బంతితో performance విఫలమైనందున, కెప్టెన్‌గా గిల్ ప్రదర్శనపై అభిమానుల దృష్టి ఉంటుంది.




















