
Diwali 2025 : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్న పిల్లలకు పెద్దవారికి దీపావళి పండుగ ఎంతగానో ఇష్టం. దీపావళి పండుగకు కొత్త దుస్తులు ధరించి మిఠాయిలు తింటారు అనంతరం టపాసులు కాలుస్తారు. చాలామంది ఇళ్లలో వ్యాపారాల వద్ద లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎంతో ఇష్టంగా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూలు పండ్లు పలహారాలతో పూజలు నిర్వహిస్తారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో కాంతులు నింపుతుంది. దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు వెలిగిపోతుంది. అలాంటి దీపావళి పండుగకి పూజ చేసే సమయంలో కొంతమంది తెలిసో తెలియకో కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. దీపావళి రోజున తప్పకుండా పూజలు చేయాలి. Diwali 2025
Doing these pujas on Diwali 2025 inauspicious
చాలామంది ఇళ్లలోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకంతో దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే దీపావళి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. నలుపు రంగు దుస్తులు ధరించి పూజలు నిర్వహించడం అస్సలు మంచిది కాదు. ఇది దురదృష్టానికి కారణం అవుతుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టే సమయంలో సరైన దిశను ఎంచుకోవాలి పూజా స్థలంలో ఎడమవైపుకి తొండం ఉన్నగణేశుడి విగ్రహాన్ని అస్సలు ఉంచకూడదు. లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు లేదా దాని తర్వాత వెంటనే టపాసులు కాల్చకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవికి హారతి ఇస్తూ పాట పాడుతున్నప్పుడు చాలామంది చప్పట్లు కొడతారు అలా చేయడం మానుకోవాలి. Diwali 2025
Also Read: Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్
దానికి బదులుగా ఒక చిన్న గంటను వాడాలి. పూజ తర్వాత కలశం లోని నీటిని బయట పారవేయకుండా ఇంట్లో ఉన్న మొక్కలకు, పూల కుండీలలో పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలామంది పూజలు జరిపి టపాసులు కాల్చి రాత్రి పడుకుంటూ ఉంటారు. కానీ దీపావళి పండుగ రోజున రాత్రి సమయంలో మేల్కొని ఉండాలి. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని స్వాగతించాలి. అలా చేయడంవల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం చాలామంది దీపావళి రోజున రాత్రి సమయంలో మేల్కొని ఉండేవారు. అలా చేసినట్లయితే ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. దీపావళి రోజున ఈ నియమాలను పాటించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. Diwali 2025
Also Read: Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?


