Donate: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు….!

Donate

Donate: దానం చేయడం ఎంతో మంచిది. దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు దానం చేయాలి అనే మాటను చెబుతూనే ఉంటారు. మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఈ నియమాన్ని నేటికీ ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు. ఇంటి ముందుకు ఎవరైనా దానం చేయమని వచ్చి అడిగితే లేదు అనకుండా ఎంతోకొంత తోచినంతగా దానం చేయాలి. దానివల్ల దేవుడి ఆశీస్సులు మనపై మన కుటుంబంపై ఉంటాయి. ఇక కొంతమంది డబ్బులు దానం చేస్తే మరి కొంతమంది భోజనం, బియ్యం, శనగలు, ఉప్పు, నూనె లాంటివి దానం చేస్తూ ఉంటారు. Donate

These items should not be Donate even by mistake

ఇక తెలిసో తెలియకో కొంతమంది కొన్ని రకాల వస్తువులను దానం చేస్తారు. అయితే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…. నూనె, ఉప్పు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఉపవాసం లేదా పండుగల సమయంలో పొరపాటున కూడా ఉప్పు లేదా నూనె దానం చేసినట్లయితే ఇంటికి అసలు మంచిది కాదు. దీనివల్ల మనం చేసిన ఉపవాస ఫలితం దానం పొందిన వ్యక్తులకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు వస్తాయి అందువల్లనే దానం చేసే సమయంలో నూనె, ఉప్పుకు బదులుగా ఇతర పదార్థాలను దానం చేయాలని పండితులు చెబుతున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని కూడా దానం చేయకూడదు. ఇంటి ముందుకు బిచ్చగాళ్ళు మిగిలిపోయిన ఆహారం ఇవ్వమని వచ్చి అడుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న ఆహారాన్ని బిచ్చగాళ్ళకు వేసినట్లయితే ఇంట్లో సంపద, శ్రేయస్సు తొలగిపోతుంది. ఇది కుటుంబంలో అనారోగ్యం, పేదరికం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలను తీసుకువస్తుందని చెబుతున్నారు. Donate

Also Read: Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?

ఇతరులకు ఆహారం పెట్టే సమయంలో ఎల్లప్పుడూ శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే దానం చేయాలని మిగిలిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదని చెబుతున్నారు. చీపురును ఎవరికి పొరపాటున కూడా దానం చేయకూడదు. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురుని దానం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని నమ్ముతారు. ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతే అనేక రకాల అనార్ధాలు సంభవిస్తాయి. పొరపాటున కూడా చీపురుని ఎవ్వరికీ ఇవ్వకూడదు దానం చేయకూడదు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పుస్తకాలు లేదా గ్రంథాలను దానం చేయకూడదు. మనం దానం చేసినప్పుడు దానం పొందిన వ్యక్తి మత గ్రంథాలు, పుస్తకాలను శుభ్రంగా ఉంచకపోతే దానం చేసిన వ్యక్తికి పాపం తగులుతుంది. దీనివల్ల జీవితంలో అడ్డంకులు సమస్యలు వస్తాయి. పదునైన వస్తువులను ఎవరికి దానం చేయకూడదు. కత్తులు, ఉక్కు పాత్రలు, కత్తెరలు, ఆయుధాలు లాంటి వస్తువులను దానం చేయకూడదు. వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి, ఆనందం కోల్పోతాము. కుటుంబ ఆదాయ వనరులు నిలిచిపోతాయి. అలాంటి వస్తువులను పొరపాటున కూడా దానం చేసినట్లయితే అనేక రకాల సమస్యలు వస్తాయి. Donate

Also Read: Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu