
Jubilee Hills by Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అదిరిపోయే స్కెచ్ వేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా బీఫామ్ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గారికి ఇచ్చారు. కానీ నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పీజేఆర్ కుమారుడితో బ్రహ్మాస్త్రం వదిలారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేశారు పిజెఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. Jubilee Hills by Poll
PJR Son Vishnu Vardhan Reddy nomination in Jubilee Hills byPoll
కెసిఆర్ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా పిజార్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది గులాబీ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత మూడు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయని కొత్త ఆలోచన చేసింది. ముందు జాగ్రత్తతో విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ దాఖలు చేయించింది గులాబీ పార్టీ. Jubilee Hills by Poll
Also Read: Drinking Water: నీళ్లు నిలబడి తాగితే, ప్రమాదమేనా..అయితే ఇవి తెలుసుకోండి?
దీంతో తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అటు గులాబీ పార్టీ తరఫున సునీత ఉన్నారు. దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పటిలాగే పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. రిజల్ట్ నవంబర్ 14వ తేదీన వెలువడుతుంది. Jubilee Hills by Poll
Also Read: Jowar Roti: రోజు జొన్న రొట్టె తింటున్నారా…అయితే జాగ్రత్త


