
Rohit – Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఇవాళ పెర్త్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కువ పదే పదే వర్షం అడ్డంకిగా మారినప్పటికీ… రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు అట్టర్ ఫ్లాప్ కావడం హాట్ టాపిక్ అయింది. Rohit – Kohli
Rohit – Kohli failure in ind vs aus odi
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఆడతారని అందరూ అనుకుంటున్నారు. అయితే వాళ్లు అక్కడ ఆడాలంటే ఆస్ట్రేలియా గడ్డపై మెరవాలని చర్చ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. మొదటి వన్డే మ్యాచ్ లో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ తొందరగానే అవుట్ అయ్యాడు. అటు విరాట్ కోహ్లీ ఖాతా ఓపెన్ చేయకుండానే డక్ అవుట్ గా పెవిలియన్ దారి పట్టాడు. Rohit – Kohli
Also Read: Jowar Roti: రోజు జొన్న రొట్టె తింటున్నారా…అయితే జాగ్రత్త
దీంతో ఈ ఇద్దరు క్రికెటర్ల పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. మంచి అవకాశాన్ని ఇద్దరు ప్లేయర్లు నాశనం చేసుకున్నారని ఫైర్ అవుతున్నారు అభిమానులు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరు సరిగానే ఉందని ఇప్పుడు అతడికి సపోర్ట్ గా నిలుస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇలా ఆడితే రోహిత్ శర్మతో పాటు కోహ్లీని గంభీర్ ఖచ్చితంగా తొలగిస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. Rohit – Kohli
Also Read: Drinking Water: నీళ్లు నిలబడి తాగితే, ప్రమాదమేనా..అయితే ఇవి తెలుసుకోండి?




















