Rakul Preet Singh: లక్ లేని రకుల్..రీ ఎంట్రీ ని టాలీవుడ్ పట్టించుకుంటుందా?

Rakul Preet Singh:బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు చూపు సారించినట్టు తెలుస్తోంది. Kondapolam తర్వాత ఆమె పూర్తిగా Bollywoodలో బిజీ అయి, అక్కడ దాదాపు తొమ్మిది సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాల్లో ఒక్కటీ హిట్ కాకపోవడంతో, ఆమె కెరీర్ కొంత డౌన్‌ఫేజ్‌లోకి వెళ్లింది. De De Pyaar De 2 మరియు Pati Patni Aur Who Do వంటి సినిమాలు కూడా పెద్దగా బజ్ (Buzz) క్రియేట్ చేయలేకపోయాయి.

Rakul Preet Singh comeback news

ఇప్పుడు రకుల్ మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. తన పాత మేనేజర్ సాయంతో దర్శకులు, నిర్మాతలను సంప్రదిస్తూ, పాత పరిచయాలను రీ-కనెక్ట్ చేసుకుంటోంది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఆమెకు మంచి స్నేహితులు కావడంతో, ఆ సపోర్ట్ కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అయితే, రకుల్ గతంలో టాలీవుడ్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. “పాన్ ఇండియా సినిమాలు కొందరికే ఇస్తున్నారు, సీనియర్లను పట్టించుకోవడం లేదు” అన్న వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

పూజా హెగ్డేలా సౌత్‌లో మళ్లీ కంబ్యాక్ కావాలంటే, రకుల్ తన ఇమేజ్‌ను రీబిల్డ్ చేయాలి. ఆమె ప్రతిభ, గ్లామర్ ఇప్పటికీ బలంగా ఉన్నా, టాలీవుడ్ నిర్మాతలు ఆమెను తిరిగి Consider చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం సమయం మాత్రమే చెబుతుంది.

Share your love