
Suman: సీనియర్ హీరో సుమన్ మరియు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ కలిగిన రాజశేఖర్ల మధ్య ఉన్న విభేదాల పుకార్లు చాలా కాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ వాయిస్ వల్లే పాత్రలకు మరింత బలం వచ్చిందని చాలామంది భావిస్తారు. అయితే, ఈ ముగ్గురి మధ్య డబ్బింగ్ వివాదం కారణంగా దూరం ఏర్పడిందని వార్తలు వచ్చాయి.
Suman clarifies feud with Rajasekhar rumors
తాజాగా సుమన్ ‘iDream Post’ ఇంటర్వ్యూలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. “నేను చేసిన సినిమాల వల్లే సాయికుమార్ పాపులర్ అయ్యారు. తరువాత రాజశేఖర్ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కానీ, మాకు ఎలాంటి గొడవలు లేవు. ఇటీవల ఒక ఫంక్షన్లో కలిశాం కూడా” అని ఆయన తెలిపారు.
అలాగే, “పోలీస్ స్టోరీ (Police Story) తర్వాత సాయికుమార్ హీరోగా బిజీ అయ్యారు. అందుకే ఆయన మా సినిమాలకు డబ్బింగ్ చెప్పలేకపోయారు. ఆయన స్వయంగా చెప్పడంతో నేను సరేనని చెప్పాను” అని సుమన్ వివరించారు.
చివరగా, “రాజశేఖర్‌తో కూడా, సాయికుమార్‌తో కూడా నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పుకార్లలో ఎలాంటి నిజం లేదు” అంటూ సుమన్ స్పష్టం చేశారు. దీనితో ఈ ముగ్గురి మధ్య విభేదాల పుకార్లకు ఎండ్ కార్డ్ పడినట్లైంది.





