
Varun Tej: మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వీరంతా చిరంజీవిని అడ్డుగా పెట్టుకొని వచ్చిన వారే. ఇక ఇందులో మెగా బ్రదర్స్ తరువాత వారి వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో రాంచరణ్ ముందుస్థానంలో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఉంటారు. వరుణ్ తేజ్ 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు.
Netizens defamed Varun Tej
ఇక ఈయన కెరియర్ నిలబెట్టిన చిత్రాల్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేసిన ఫిదా మూవీ. ఆ తర్వాత తొలిప్రేమ, ఎఫ్2,ఎఫ్3 సినిమాల్లో నటించి తనకు తిరుగు లేదనిపించుకున్నారు. ఇక గద్దల కొండ గణేష్ సినిమా ద్వారా ఈయన కూడా మాస్ పాత్రల్లో సెట్ అవుతారని నిరూపించుకున్నారు.. అలా హిట్స్ ఫ్లాప్స్ అని తేడా లేకుండా ముందుకు వెళుతున్నటువంటి వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో పూర్తిగా బోల్తా పడుతున్నారు. (Varun Tej)
Also Read: Heroines: నచ్చకపోతే ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకోవచ్చు.. దుమారం రేపుతున్న స్టార్ హీరోయిన్ల కామెంట్స్.!
గాండీవ దారి అర్జునా, మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు చేశారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.. ఇక కెరియర్ ఆ విధంగా కొనసాగుతున్న సమయంలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డారు. చివరికి ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు ఒక బాబు కూడా పుట్టారు.. కట్ చేస్తే తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు.. ఈ ఫోటోని చూసినటువంటి జనాలు వరుణ్ తేజ్ ని చాలా విమర్శిస్తున్నట్టు కామెంట్లు పెట్టారు..

ఇందులో ఒక నెటిజెన్ స్పందిస్తూ అన్న హీరోగా ట్రై చేస్తే బాగుండు, మరొకరు అన్నయ్య హీరో అయితే బాగుండు.. అలాగే మరో నెటిజన్ హీరోగా ట్రై చెయ్ మంచి భవిష్యత్తు ఉంటుందంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు.. అయితే తెలుగు ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ ఎప్పుడో హీరో అయ్యారు. 2014లోనే ఆయన సినిమా వచ్చింది.. కానీ ఆయన ఫోటో చూసిన కొంత మంది కావాలనే హీరోగా ట్రై చేయి అంటూ ఆయన ఫేస్ ఇప్పటి వరకు తెలియదన్నట్టు కామెంట్లు చేయడంతో మెగా హీరో పరువు తీసారంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు..(Varun Tej)





