
Harish Rao Father: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇవాళ ఉదయం మరణించారు. వృద్ధాప్య సమస్యలతో గత కొన్ని రోజులుగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు బాధపడుతున్న సంగతి తెలిసిందే. Harish Rao Father
Harish Rao Father Passes Away
అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించినట్లు చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. ఈ వార్త వినగానే గులాబీ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన్నీరు హరీష్ రావు కుటుంబం విషాదంలోకి వెళ్ళింది. ఇక హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణించిన నేపథ్యంలో వేలాది సంఖ్యలో గులాబీ పార్టీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. Harish Rao Father
Also Read: Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచలన నిర్ణయం
అటు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతాపం తెలిపారు. హుటాహుటిన హరీష్ రావు ఇంటికి బయలుదేరారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హరీష్ రావు దూసుకుపోతున్న నేపథ్యంలో.. ఆయన ఇంట విషాదం నెలకొనడం గులాబీ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ విషాదం నేపథ్యంలో హరీష్ రావు.. జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరం కానున్నారు. Harish Rao Father
Also Read: Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?





