
Vikram: ఏంటి ఆ హీరో తండ్రి విక్రమ్ ని తొక్కేయాలని చూసారా.. అంటే నిజమే అంటారు అప్పటి ఇండస్ట్రీ జనాలు. అయితే ఆ హీరో తండ్రి విక్రమ్ కి స్వయాన మేనమామ.. కానీ విక్రమ్ ఎదుగుదలని ఆయన ఓర్వలేకపోయారట.అంతేకాదు తన కొడుకుని స్టార్ ని చేయాలని విక్రమ్ ని తొక్కేయాలని చాలాసార్లు అనుకున్నారట. కట్ చేస్తే విక్రమ్ పెద్ద స్టార్ అయ్యారు.ఆయన కొడుకు ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. మరి ఇంతకీ విక్రమ్ ని తొక్కేయాలని చూసిన ఆ హీరో తండ్రి ఎవరయ్యా అంటే ఒకప్పటి సీనియర్ నటుడు డైరెక్టర్ అయినటువంటి త్యాగరాజన్.
The star hero father wanted to crush Vikram
తమిళనాడు లో ఎంతో మంచి గుర్తింపు పొందిన త్యాగరాజ్యన్ కొడుకు ప్రశాంత్ అందరికీ తెలుసు. ఈయన జీన్స్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్ కి స్వయాన మేనమామ..త్యాగరాజన్ చెల్లెల్ని విక్రమ్ తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే తన చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో విక్రమ్ తండ్రిపై త్యాగరాజన్ కోపం పెంచుకున్నాడు. (Vikram)
Also Read: Roja: నేను సినిమాలు మానేయడానికి కారణం ఆయనే.. విజయ్ పై రోజా షాకింగ్ కామెంట్స్.?
దాంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాటల్లేవు. అయితే ఇరు కుటుంబ సభ్యులు ఎప్పుడు పబ్లిక్ గా దూషించుకోకపోయినప్పటికీ ఎక్కడా కూడా వీరు మాట్లాడుకోలేదు. అంతేకాదు విక్రమ్ తండ్రి చనిపోయినప్పుడు కూడా త్యాగరాజన్ రాలేదు. ఇక సినిమాల్లోకి విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్న టైమ్ లో త్యాగరాజన్ ఆయన్ని తొక్కేయాలని చూసారట.ముఖ్యంగా విక్రమ్ కి ఆఫర్స్ రాకుండా చాలా ప్రయత్నాలు చేశారట. కానీ టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కలేం అన్నట్టు విక్రమ్ అంతకంతకు ఎదిగారు. ఇక విక్రమ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ప్రశాంత్ అప్పటికే పెద్ద హీరో.

ఆ సమయంలో విక్రమ్ అవకాశాల కోసం వెతుక్కుంటున్నాడు.కానీ అలాంటిది త్యాగరాజన్ కి ఉన్న దుర్భుద్ధి కారణంగా విక్రమ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు ఇప్పటికీ సినిమాల్లోనే రాణిస్తున్నారు. కానీ త్యాగరాజన్ కొడుకు ప్రశాంత్ మాత్రం సినిమాల్లో కనుమరుగైపోయారు. ఆయన అప్పుడప్పుడు ఏదో సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు తప్ప హీరోగా సినిమాలైతే చేయట్లేదు. అలా విక్రమ్ మేనల్లుడే అయినప్పటికీ ఆయనకు ఇండస్ట్రీలో ఏ కొంత సహాయం కూడా చేయలేదట ప్రశాంత్ తండ్రి త్యాగరాజ్యన్.(Vikram)


