Roja: నేను సినిమాలు మానేయడానికి కారణం ఆయనే.. విజయ్ పై రోజా షాకింగ్ కామెంట్స్.?

Roja shocking comments on Vijay

Roja: ఏంటి రోజా సినిమాలు మానేయడానికి కారణం విజయ్. ఇన్ని రోజులు ఈ విషయం మాకు తెలియదే..విజయ్ వల్ల రోజ ఎందుకు సినిమాలు మానేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు.అయితే ఈ విషయం రూమర్ కాదు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రోజా విజయ్ వల్లే నేను సినిమాలు మానేశానని క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రోజా ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక తల్లి,అత్త పాత్రలు చేస్తూ ఉంటారు.

Roja shocking comments on Vijay

అలా రోజా కూడా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక ప్రియమణి,అసిన్ వంటి హీరోయిన్స్ కి తల్లి పాత్రల్లో కూడా నటించింది. అయితే అసిన్, విజయ్ కాంబోలో వచ్చిన కావలన్ సినిమాలో రోజాను చూసిన విజయ్ షాక్ అయిపోయి ఏంటండీ మీరు అసిన్ కి తల్లిగా నటిస్తున్నారా.. అంటే నాకు అత్తగా నటిస్తున్నారా..ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.. మేం మిమ్మల్ని ఇలాంటి పాత్రలో చూడలేం.(Roja)

Also Read: Ram Charan: రామ్ చరణ్ కి బిపి వస్తే చేసే పని.. నోట్లో నుండి ఆ పచ్చి బూతు…

మేము మిమ్మల్ని ఎప్పటికీ హీరోయిన్ గానే చూడాలి అనుకుంటున్నాం అంటూ రోజా ఆశ్చర్యపోయే మాటలు మాట్లాడారట. అంతేకాదు ప్రియమణికి తల్లిగా రోజా నటించిన గోలీమార్ మూవీ సమయంలో కూడా గోపీచంద్ ఏంటి మీరు అత్తలా నటిస్తున్నారా.. హీరోయిన్ గానే బాగుంటారు. అత్త పాత్రకి సెట్ అవ్వరు అని అన్నారట. అలా ఇద్దరు హీరోల షూటింగ్ సమయంలో ఎదురైనా అనుభవం కారణంగా రోజా మళ్లీ అలాంటి పాత్రలో నటించకూడదని అనుకుందట.

Roja shocking comments on Vijay

అంతేకాదు విజయ్ మాట్లాడిన మాటలు తనపై ఎక్కువ ప్రభావం చూపించాయి అని రీసెంట్ ఇంటర్వ్యూలో రోజా చెప్పుకొచ్చింది. అలాగే తనకు మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందని, కానీ రమ్య కృష్ణ బాహుబలి మూవీ లో పోషించిన రాజమాత శివగామి లాంటి పాత్ర వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. మరి రోజాకి రమ్యకృష్ణ లాంటి పాత్రలు మళ్లీ వస్తాయా అనేది చూడాలి.(Roja)

Share your love