Hero: 48 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అమ్మాయిల డ్రీమ్ బాయ్..!

The Hero who is going to become a father at the age of 48

Hero: హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి కాస్త ఫేడౌట్ అయిపోయారు. అయితే ఈయన ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ, పెళ్లిళ్లు, వివాదాలు అని చెప్పవచ్చు. అలాంటి సిద్ధార్థ్ ప్రస్తుతం 48 ఏళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఆయన 40 ఏళ్ల వయస్సు ఉన్న ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు.

The Hero who is going to become a father at the age of 48

ఆమె ఎవరో కాదు అందరికీ తెలిసినటువంటి నటి అతిధి రావు హైదరి. తన నటన, సంగీతం, అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి అదితి రావు హైదరి వృత్తిపరంగా ఎంతో సక్సెస్ అయినా కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొన్నది. (Hero)

Also Read: Baahubali The Epic: బాహుబలి రీ రిలీజ్ ని పట్టించుకోని ప్రేక్షకులు.. ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ పై…

మొదట సత్యదీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విభేదాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే ఆమె తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఊపందుకున్నాయి. అయితే రీసెంట్ గా ఎయిర్పోర్టులో హీరో సిద్ధార్థ్ ఆమెను జాగ్రత్తగా తీసుకుపోవడం చూసి ఎవరో సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టారు.

The Hero who is going to become a father at the age of 48

ఇది చూసి అధితి రావు హైదరీ ప్రెగ్నెంట్ అయింది కావచ్చు..అందుకే సిద్ధార్థ్ అంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో చాలామంది అభిమానులు లేట్ వయసులో ఘాటు ప్రేమ అంటూ కామెంట్లు పెడుతున్నారు..(Hero)

Share your love