Sandeep Reddy Vanga: ఆ హీరోని కొట్టిన సందీప్ రెడ్డి వంగా..?

Sandeep Reddy Vanga: ప్రస్తుతం మంచి జోరు మీదున్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు.. ఈయన ఏ సినిమా డైరెక్షన్ చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పనిసరిగా సినిమాలో కొత్తదనం

Is it Sandeep Reddy Vanga who beat that hero

Sandeep Reddy Vanga: ప్రస్తుతం మంచి జోరు మీదున్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు.. ఈయన ఏ సినిమా డైరెక్షన్ చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పనిసరిగా సినిమాలో కొత్తదనం చూపించడంలో దిట్ట అని చెప్పవచ్చు. అలాంటి సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఎంతో కష్టపడితే కానీ అర్జున్ రెడ్డి సినిమా ఆ విధంగా రాదు అని చెప్పవచ్చు.. ఈ సినిమా తనకు సక్సెస్ ఇవ్వడమే కాకుండా హీరో విజయ్ దేవరకొండకు కూడా చాలా పేరు తీసుకువచ్చింది.

Is it Sandeep Reddy Vanga who beat that hero

తన కెరీయర్ ని టర్న్ చేసిందని చెప్పవచ్చు. అలా సందీప్ రెడ్డి వంగా ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ గా మాత్రం కొనసాగుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈయన ఏదైనా సహిస్తారు కానీ డైరెక్షన్ చేసే విషయంలో నటీనటులు వినకుంటే మాత్రం చాలా సీరియస్ అవుతారట. అత్యుత్సాహానికి పోయి డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా మరోలా నటిస్తాం అంటే అస్సలు వినరట. ఇది చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా తాను అనుకున్నట్టే రావాలని భావిస్తారట. అలా యాక్టింగ్ లో కాస్త తప్పు చేస్తే సందీప్ రెడ్డివంగా ఒక నటుడిని కొట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎవరు వివరాలు చూద్దాం. (Sandeep Reddy Vanga)

Also Read: Rana: మద్యం మత్తులో రానా.. స్టేజ్ పైన ఎలా.. లైవ్ లో ఆడేసుకున్న అభిమానులు.!

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో రాహుల్ రామకృష్ణను వెనుక నుంచి తలపై కొట్టాడట. దీనికి కారణం రాహుల్ రామకృష్ణ సందీప్ చెప్పినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే కోపానికి వచ్చిన సందీప్ తల మీద ఒక్కటిచ్చారట. తర్వాత ఆ పాత్ర గురించి డెప్త్ గా చెప్పి నేను చెప్పినట్లు వినమని హితవు పలికారు.

Is it Sandeep Reddy Vanga who beat that hero

ఇంతకీ ఆ సీన్ ఏంటంటే హీరోయిన్ కి పెళ్లి అవుతున్న సమయంలో, హీరో వెళ్లి ఆ పెళ్లిని ఆపాలని చూస్తుంటే రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ గా కొన్ని డైలాగులు చెప్పే సీన్ ఉంటుంది. ఈ సీన్ విషయంలోనే రాహుల్ కాస్త అత్యుత్సాహం చూపిస్తే సరదాగా తలపై కొట్టి అలా కాదు ఇలా అని సెట్ చేశారట సందీప్. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Sandeep Reddy Vanga)