Rana: మద్యం మత్తులో రానా.. స్టేజ్ పైన ఎలా.. లైవ్ లో ఆడేసుకున్న అభిమానులు.!

Fans insulted Rana while drunk
Fans insulted Rana while drunk

Rana: సినిమా ఈవెంట్లకు సంబంధించిన వేదికల మీద సినీ నటీనటులు చాలా జాగ్రత్తగా ఉంటారు.ఏ చిన్న తప్పు చేసిన సరే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఏకిపారేస్తూ ఉంటారు. అందుకే ఒక్కసారి స్టేజి ఎక్కారంటే చాలు మళ్ళీ దిగే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా నటుడు రానా స్టేజ్ మీదికి తాగి వచ్చాడు అంటూ ఆయన అభిమానులు ఆడిటోరియంలో చేసిన గోల కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Fans insulted Rana while drunk

ఇక అసలు విషయం ఏమిటంటే.. దుల్కర్ సల్మాన్,రానా,భాగ్యశ్రీ బోర్సే సముద్ర ఖనిలు నటిస్తున్న తాజా మూవీ కాంత.ఈ మూవీ నవంబర్ 14న విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఈవెంట్ ని కూడా చేశారు.ఇక ఈ ఈవెంట్లో స్టేజ్ మీదకి మాట్లాడడానికి వచ్చిన రానాని చాలా రోజుల తర్వాత చూడడంతో ఆయన అభిమానులంతా కేకలు వేశారు. (Rana)

Also Read: Katrina Kaif: ఫలించని జ్యోతిష్యం.. అప్పుడు దీపికా ఇప్పుడు కత్రినా..పప్పులో కాలేస్తున్న జ్యోతిష్యులు.!

అంతేకాకుండా ఏంటన్నా తాగొచ్చావా అంటూ అక్కడి అభిమానులు గట్టిగా అరిచిన వీడియో వైరల్ గా మారింది. అయితే అభిమానులు వేసిన ప్రశ్నకి అరే నేను తాగి రాలేదు రా బాబు..నా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మీతో పంచుకోవడానికి వచ్చాను.నన్ను మాట్లాడినివ్వండి రా అంటూ సమాధానం ఇచ్చారు. అయితే అంతా బాగానే ఉంది కానీ అభిమానులు అలా రానాని తాగి వచ్చావా అన్నా అని అడగడం మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది.ఎందుకంటే రానా అక్కడ తప్పుగా ఏమి ప్రవర్తించలేదు. మద్యం మత్తులో ఉండి తూలినట్టు కూడా కనిపించలేదు.

Fans insulted Rana while drunk

అలాంటిది ఫ్యాన్స్ ఎందుకు అలా రానా పరువు తీసేసారు అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్. ఇక రానా ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా చిన్నతనంలో సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చింది. ఇక మద్రాస్ లో ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది అనే బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుంది. అలాగే డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు దీనికి పర్ఫెక్ట్ గా దుల్కర్ సెట్ అవుతాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఏవైనా పిరియాడిక్ సినిమాల్లో కనిపించాలంటే దానికి దుల్కరే పర్ఫెక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు రానా.(Rana)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu