
Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అభిమానులని ప్రేమగా దగ్గరకు తీసుకునే విషయంలో ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు. మిగతా హీరోలందరూ తమ అభిమానులని ప్రేమగా దగ్గరికి తీసుకొని వారికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం తన దగ్గరికి వచ్చిన అభిమానులని పక్కకు నెట్టేస్తూ వారిని కొడుతూ, తిడుతూ, అవమానిస్తూ ఉంటారు.ఈ విషయంలో ఎప్పుడు బాలకృష్ణని మిగతా హీరోల అభిమానులు నిందిస్తూనే ఉంటారు.
Balakrishna fires when someone asks him to come
కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఆయన ఏం చేసినా ఓకే అన్నట్లుగా పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానుల పై ఫైర్ అవుతూ మొహం పట్టుకుని తిట్టాడు. నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి.. నువ్వు నాకు కనిపించకూడదు అంటూ బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీకి సంబంధించిన సాంగ్ లాంఛింగ్ కోసం బాలకృష్ణ,బోయపాటి శ్రీను మిగతా చిత్ర యూనిట్ అందరూ కలిసి వైజాగ్ కి వెళ్ళగా.. (Balakrishna)
Also Read:IBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్.. గతంలో అలాంటి పని చేసేవారా.?
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోకి కొంతమంది అభిమానులతో పాటు మీడియా వాళ్ళు కూడా వెళ్లి బాలకృష్ణని సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో బాలకృష్ణ రావడంతోనే జై బాలయ్య అంటూ నినాదాలు కూడా వినిపించాయి.అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ ఓ వ్యక్తిని చూసి నిన్ను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి ఎవరు రానిచ్చారు అంటూ ఓ వ్యక్తిపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాక వెళ్లిపోయేటప్పుడు సాయంత్రం ఈవెంట్లో వాడు నాకు కనిపించకూడదు అంటూ ఫైర్ అయ్యారు.

బాలకృష్ణ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు అంత ప్రేమగా అభిమాని వస్తే అలానేనా మాట్లాడడం..నిన్ను పిచ్చిగా అభిమానించడమే వాళ్ళు చేసిన తప్పా అని కొంతమంది అంటున్నారు. ఇక మరికొంతమందేమో బాలకృష్ణ తిట్టింది అభిమానిని కాదని, ఓ రిపోర్టర్ ని అని, ఓ రిపోర్టర్ బాలకృష్ణని విసిగించడం వల్లే ఆయన్ని సాయంత్రం ఈవెంట్ కి కూడా రానివ్వకూడదని బాలకృష్ణ చెప్పినట్టు అంటున్నారు. మరి బాలకృష్ణ అభిమానిని తిట్టారా..లేక రిపోర్టర్ ని తిట్టారా..అనేది తెలియాల్సి ఉంది.(Balakrishna)





