Producer: స్టార్ హీరోయిన్ తో నిర్మాతకి గొడవ..నన్ను రెచ్చగొడితే అంతే.. కోట్లు పోయిన మధ్యలోనే వదిలేస్తా.!

Producer has a fight with the star heroine
Producer has a fight with the star heroine

Producer: ఏంటి ఆ హీరోయిన్ తో నిర్మాతకి నిజంగానే గొడవ జరిగిందా .. అందుకే నిర్మాత సినిమాలు వదిలేసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారా..ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అనేది చూస్తే.. ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు వచ్చేవి.అలా ఎంతమంది హీరో హీరోయిన్లకు భవిష్యత్తు ఇచ్చిన నిర్మాత ఎమ్మెస్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఎంఎస్ రాజు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు.

Producer has a fight with the star heroine

ఇందులో భాగంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. నా దగ్గర కథ లేనప్పుడు నేను పెద్ద హీరోలను పెట్టి సినిమాలు ఎలా తీయగలను. అలాగే మంచి కథలు ఉంటేనే నేను సినిమా చేస్తాను. ఇప్పుడు సినిమాలు తీయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు.అందుకే ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాను. ఇక చాలా రోజుల నుండి నాకు ఓ హీరోయిన్ తో గొడవ అయిందని చెబుతున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆమె పేరు ఏంటో మీరే చెప్తే బాగుంటుంది.(Producer)

Also Read: Varanasi: రాజమౌళి మహేష్ కాదు.. వారణాసి ఈవెంట్ మొత్తం ఆ డైరెక్టర్ జపమే చేసిందిగా..!

ఒకవేళ నాకు హీరోయిన్ తో గొడవ అయితే ఆ సినిమా మధ్యలోనే వదిలిస్తాను. ఎన్ని కోట్లయినా సరే ఆ సినిమాని మధ్యలోనే వదిలేస్తాను. ఇక గతంలో ఒకసారి అలాగే జరిగింది. సినిమా మధ్యలో గొడవ జరిగి షూటింగ్ మొత్తం క్యాన్సల్ చేసి కోట్లు పోయిన పర్వాలేదు అనుకున్నాను.ఆ తర్వాత సినిమా వాళ్ళందరూ కన్విన్స్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు చేయండి.కానీ సినిమా మాత్రం మధ్యలో ఆపకండి అని పూర్తి బాధ్యత నాకే అప్పచెప్పారు.

Producer has a fight with the star heroine

దాంతో కన్విన్స్ అయి మళ్ళీ సినిమా పూర్తి చేశాను. నన్ను రెచ్చగొడితే అంతే.. కోట్లు పోయిన ఆలోచించను.ఇక పెద్ద హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ వస్తాయి. చిన్న హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ రావు అని ఏమీ ఉండదు. కథ ఉంటే ఏ సినిమాకైనా సరే ఓపెనింగ్స్ వస్తాయి అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు నిర్మాత ఎంఎస్ రాజు. అలాగే తన వల్లే త్రిష,ప్రభాస్, మహేష్ బాబులు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని కూడా చెప్పుకొచ్చారు.(Producer)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu