TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Telangana

TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మ‌రో కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. కొత్త ఎయిర్ పోర్ట్ డీపీఆర్ కు త్వ‌ర‌లోనే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం ల‌భించ‌నుంది. త్వ‌ర‌లోనే నిర్మాణ ప‌నులు కూడా ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. ఏడాదిలోపు పూర్తి చేసి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు అధికారులు. TELANGANA

GOOD NEWS FOR THE PEOPLE OF TELANGANA AN OTHER NEW AIRPORT IN A YEAR

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కే అందుబాటులో ఉంది. దీంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా విమాన ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు వ‌రంగ‌ల్ లోని మామునూర్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వ‌స్తే.. రాష్ట్ర ప్ర‌జ‌లు హైద‌రాబాద్ రావాల్సిన అవ‌స‌ర‌ముండ‌దు. వ‌రంగ‌ల్ నుంచి రాక‌పోక‌లు కొన‌సాగించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ కి డీపీఆర్ సిద్ధం అవ్వ‌గా.. కేంద్రం నుంచి డీపీఆర్ కు అనుమ‌తి రావాల్సి ఉంది. TELANGANA

Also Read : KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?

త్వ‌ర‌లోనే కేంద్రం ఆమోదించ‌నుండ‌గా.. ఆ త‌రువాత నిర్మాణ ప‌నులు మొద‌లుకానున్నాయి. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాల‌ని అధికారులు ల‌క్ష్యం నిర్దేశించుకున్నారు. ఎయిర్ పోర్టు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తి చేసింది. 950 ఎక‌రాల భూమిని సేక‌రించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియ‌యాకి అప్ప‌గించింది. అద‌నంగా మ‌రో 253 ఎక‌రాలు సేక‌రించింది. ఈ ఎయిర్ పోర్టులో టెర్మిన‌ల్, కార్గో సౌక‌ర్యంతో పాటు పార్కింగ్ అనుసంధాన మార్గాలు వంటివి ఉండ‌నున్నాయి. ప్ర‌స్తుతం చిన్న ఎయిర్ స్ట్రిప్ గా మామునూరు ఎయిర్ పోర్టు ఉంది. దీనిని పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎయిర్ పోర్ట్ గా మార్చ‌నున్నారు.

Also Read : IRAN-ISRAEL WAR : ప్ర‌ధాని మోడీ పర్య‌ట‌న పై ఒవైసీ సెన్షేష‌న్ కామెంట్స్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu