
Chaitanya Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా మారిపోయిన ఈయన యూత్ మెచ్చే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అలా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, తెలుసు కదా వంటి సినిమాలతో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కీ రోల్స్ పోషిస్తున్నారు.
Chaitanya Jonnalagadda Comments on Siddhu Jonnalagadda
అలా తాజాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో వెంకన్న అనే నెగిటివ్ పాత్రలో నటించి భారీ క్రేజ్ సంపాదించారు.రాజు వెడ్స్ రాంబాయి మూవీలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన చైతన్య జొన్నలగడ్డ కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో తన విలనిజంతో కోర్టు సినిమాలో శివాజీ అంతటి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి చైతన్య జొన్నలగడ్డ తాజాగా ఓ ఈవెంట్లో తన తమ్ముడు పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటో బయట పెట్టారు.(Chaitanya Jonnalagadda)
Also Read: Tanuja: బిగ్ బాస్ సాక్షిగా లవ్ కన్ఫర్మ్ చేసిన తనూజ పవన్ సాయి..”అది నా పిల్ల రా” అంటూ…
నాకు నా తమ్ముడు పేరు బయట పెట్టుకొని సినిమాని ప్రమోట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే సిద్దు పేరు ఎక్కడా కూడా వాడను. సినిమాల కోసం బ్రదర్ ని వాడుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను నటించిన ఏ సినిమాకి కూడా సిద్ధుని పిలవలేదు. ఇక ఈ సినిమాలో నా పాత్ర చూసి సిద్దు చాలా బాగా చేశావని మెసేజ్ పెట్టారు అంటూ చైతన్య జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.

అయితే గత కొద్దిరోజుల నుండి చైతన్య జొన్నలగడ్డ సినిమాలకు సిద్దు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి చైతన్య జొన్నలగడ్డ తాజా ఈవెంట్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక చైతన్య జొన్నలగడ్డ హిట్ 3, బబుల్ గమ్ వంటి సినిమాల్లో కూడా నటించారు. అలాగే నెక్స్ట్ ఆకాశంలో ఒక తార, అలాగే రాజశేఖర్ మగాడు మగాడు మూవీలో కూడా కీ రోల్స్ పోషిస్తున్నారట.(Chaitanya Jonnalagadda)



