Manchu Manoj: కొడుకంటే ఇలా ఉండాలి తండ్రిని పీక్కు తినకూడదు.. విష్ణుకి కౌంటర్ ఇచ్చిన మనోజ్.!

Manchu Manoj countered Vishnu

Manchu Manoj: గత కొద్ది రోజులుగా మంచు విష్ణుకి మనోజ్ ఏదో ఒక విధంగా కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు.ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక ఈవెంట్లో, ఇంటర్వ్యూలో విష్ణుని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వానర మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్ళిన మంచు మనోజ్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Manchu Manoj countered Vishnu

వానర మూవీలో నటించిన హీరో తండ్రి పోలీస్ ఆఫీసర్ కొడుకు ఎంబీఏ చేసినప్పటికీ కొడుకుకి సినిమాల మీద ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి పంపించారు. తండ్రి అంటే ఇలా ఉండాలి.. నిజంగా ఈయనకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక మా నాన్నకి నాకు మోహన రాగా అంటే చాలా ఇష్టం. అందుకే మా నాన్న సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఆ ఈవెంట్ నిర్వహించిన రోజే నేను కూడా మోహనరాగా అనే కొత్త వెంచర్ ని ప్రారంభించాను.(Manchu Manoj)

Also Read: Manchu Lakshmi: ఫ్యామిలీ గొడవలపై మంచు లక్ష్మీ ఎమోషనల్.. ఆ దేవుడు కనిపిస్తే అదే కోరుకుంటా అంటూ.!

నాన్న సంతోషం కోసం నేను మ్యూజిక్ వెంచర్ స్టార్ట్ చేశా. ఇక కొంతమంది పిల్లలు తండ్రిని ఎప్పుడు పీక్కు తినాలా అని చూస్తూ ఉంటారు. కానీ కొడుకంటే తండ్రిని పీక్కు తినడం కాదు తల్లిదండ్రులకు కావాల్సింది చేసి చూపించాలి.తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఉండాలి. కానీ వారిని పీక్కు తినేలా ఉండకూడదు . నేను ఎప్పుడూ కూడా నా తండ్రికి మంచి పేరు తేవాలనే చూస్తాను అంటూ ఆ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మనోజ్.

Manchu Manoj countered Vishnu

ఇక మనోజ్ మాట్లాడిన మాటలకు చాలా మంది నెటిజెన్లు మనోజ్ విష్ణుని టార్గెట్ చేసే ఈ వ్యాఖ్యలు చేశారు.విష్ణు తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి ఆస్తిని ఎలా కొట్టేయాలని చూస్తున్నారు.మనోజ్ మాత్రం తండ్రికి దూరంగా ఉన్నా తండ్రి పై ప్రేమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Manchu Manoj)

Share your love