KTR: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. డిసెంబర్ 9వ తేదీని భారీగా ప్లాన్ చేసిన కేటీఆర్ ?

KTR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఉద్యమ చరిత్రను తెరపైకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గులాబీ పార్టీ చేసిన కృషిని వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొన్న కెసిఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించింది ఈ గులాబీ పార్టీ. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా మరో నిర్ణయాన్ని తీసుకుంది. KTR

KTR has made a big plan for December 9th

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విజయ్ దివస్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ సాధించిన విజయాలు, తెలంగాణ కోసం కెసిఆర్ పడ్డ కష్టాన్ని జనాల్లోకి తీసుకువెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివాస్ గా ఘనంగా నిర్వహించుకోవాలని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. KTR

Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవ‌మానించిన టీడీపీ ?

ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీక్ష దివాస్ తరహా లోనే విజయ్ దివాస్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోజు నా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని గులాబీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. KTR

Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజ‌న్‌, ఇక దూకుడే

Share your love