

Kavitha : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు కేసీఆర్ కూతురు కవిత. మొన్నటి వరకు కల్వకుంట్ల కవితగా ఉన్న ఆమె దేవనపల్లి కవిత అంటూ పేరు కూడా మార్చేసుకున్నారు. కాదు కాదు గులాబీ పార్టీ నేతలే మార్చేశారు. కెసిఆర్ పార్టీకి దూరమైన దేవనపల్లి కవిత, గులాబీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై దూకుడుగా ముందుకు వెళుతున్న గులాబీ పార్టీకి, కంటిలో నలకలాగా దేవనపల్లి కవిత ప్రతిసారి కన్నీళ్లు తెప్పిస్తోంది. Kavitha
Devanapalli Kavitha hunger strike on Congress
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట దేవనపల్లి కవిత. త్వరలో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు దేవనపల్లి కవిత రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేయబోతున్నారట. Kavitha
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?
అయితే ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేస్తారనేది తెలియదు కానీ.. బీసీల కోసం కెసిఆర్ తరహాలో నిరాహార దీక్ష చేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నారనీ సమాచారం అందుతోంది. సిద్దిపేట నియోజకవర్గంలో దేవనపల్లి కవిత ఈ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు పై పోటీ చేసేందుకుగాను సిద్ధమవుతున్న కవిత.. అక్కడే నిరాహార దీక్ష చేయాలని కూడా స్కెచ్ వేశారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Kavitha
Also REad: Harish Rao: NTV రిపోర్టర్లు అరెస్ట్…రంగంలోకి ట్రబుల్ షూటర్ ?







