

KTR: పల్లెల్లో గులాబీ ప్రభంజనం సృష్టించింది. 32% పంచాయతీల గెలుపుతో కారు జోరు అందుకుంది. కష్టపడి సగం సీట్లు సాధించింది అధికార కాంగ్రెస్. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ గుబాళించడం ఖాయం అనేలా తీర్పు ఇచ్చారు పల్లె ఓటర్లు. గులాబీ గుబాళింపులో..కాంగ్రెస్ డీలా.. కనీసం 700 సీట్లు కూడా సాధించలేకపోయింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ 52%, బీఆర్ఎస్ 32%, ఇతరులు 11%, బీజేపీ 5% గ్రామ పంచాయితీలలో గెలుపొందాయి. KTR
KTR BRS party wins 80 seats out of 117 panchayats
రేవంత్ సభలు, మంత్రుల ప్రచారాలు, బెదిరింపులు, ప్రలోభాలు కాంగ్రెస్‌ని కాపాడలేకపోయాయని గులాబీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రచారం చేయకపోయినా పల్లెల్లో తమ హవా చూపించారు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో వన్ సైడ్ విక్టరీలతో కాంగ్రెస్‌ని తుక్కు చేసింది బీఆర్ఎస్. అధికారంలో ఉండగా 2019 పంచాయతీ ఎన్నికల్లో 70% సీట్లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్… ఇప్పుడు 32 శాతం బీఆర్ ఎస్ పార్టీ గెలుచుకుంది. KTR
Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘటన..తిరుమల శ్రీవారిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?
అటు కేటీఆర్ పరువు కాపాడింది సిరిసిల్ల గడ్డ. తెలంగాణ సిరిసిల్ల గడ్డ.. గులాబీ అడ్డా అని మరోసారి రుజువు చేసింది. 117 పంచాయతీల్లో.. 80 స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉండి ఢీలా పడింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే.. ప్రజలు, పార్టీ కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. సిరిసిల్ల ప్రజలకు, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం ఎంత బలమైందో ఈ ఫలితాలు మరోసారి తేల్చి చెప్పాయని స్పష్టం చేశారు కేటీఆర్. KTR
Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు సస్పెండ్? ట్వీట్ వైరల్







