Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?

Kadiyam Srihari
Kadiyam Srihari

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన హవా చూపించింది. రెండో స్థానంలో గులాబీ పార్టీ నిలిచిన సంగతి తెలిసిందే. వాడు భారతీయ జనతా పార్టీకి మూడో స్థానం దక్కింది. అయితే రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ హవా చూపించినప్పటికీ, కాంగ్రెస్ అగ్ర నేతల సొంత నియోజకవర్గాలలో ఎదురుగాలి తప్పలేదు. Kadiyam Srihari

People of station Ghanpur Kadiyam Srihari Shock

ఇందులో భాగంగానే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జనాలు షాక్ త‌గిలింది. రెండవ దశ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వేలేరు, ధర్మసాగర్ మండలాలు పంచాయతీ ఎన్నికలు జ‌రిగాయి. వేలేరు మండలంలో 12 గ్రామపంచాయతీలు ఉండగా అందులో అబద్ధపు హామీలు చెప్పి రెండు గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేసుకోగా.. మిగతా పది గ్రామాల్లో 6 గ్రామాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. Kadiyam Srihari

Also Read: Akhanda 2: వైసీపీ రెక్క‌లు విరిచేసిన బాల‌య్య‌..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?

మేజర్ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా మూడు గ్రామపంచాయతీలో ముక్కి ములిగి గెలిచార‌ట‌ కాంగ్రెస్ అభ్యర్థులు. ధర్మసాగర్ మండలంలో 18 గ్రామ పంచాయతీలకు గాను ఐదు మేజర్ గ్రామాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కడియం శ్రీహరి ప్రధాన అనుచరులకు టికెట్లు ఇవ్వగా ఓటమి చవిచూశారు అభ్యర్థులు. దీంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎదురుగాలి వీచింది. Kadiyam Srihari

Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?

Share your love