

Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. వాళ్లు నిలబెట్టిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారట. Telangana BJP
Telangana BJP The situation of former BRS MLAs who joined BJP has worsened
సర్పంచ్ ఎన్నికల్లో అచ్చంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలలో కనీసం సింగిల్ విజిట్ కూడా దాటలేకపోయారట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అసలు ఖాతా ఓపెన్ చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో శానంపూడి సైదిరెడ్డి భారతీయ జనతా పార్టీని లీడ్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో 124 గ్రామాలు ఉన్నాయి. ఇందులో బిజెపి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని గెలవలేకపోయింది. Telangana BJP
Also Read: Tirumala: తెరపైకి మరో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం 178 గ్రామాల్లో గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది రెండు సీట్లు మాత్రమే. ఆరూరి రమేష్ ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం లో 84 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజెపి సర్పంచ్ స్థానాలు కేవలం నాలుగు మాత్రమే. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా తయారయిందో అర్థం చేసుకోవచ్చని గులాబీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా ట్రోల్ చేస్తోంది. Telangana BJP
Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?







