

Telangana: తెలంగాణ సర్కార్ లో షాడో మేడమ్ కలకలం రేపుతోంది. సీఎంవోలో షాడో మేడమ్ పవర్ ఉందని వార్తలు వస్తున్నాయి. పెత్తనమంతా మాధవిలత అనే మహిళ చేతిలోనే ఉందని రాజ్ న్యూస్ స్పెషల్ వీడియో తయారు చేశారు. క్షణాల్లో వీడియో వైరల్ అయింది. సీఎంవో నుంచి ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు వీడియో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. Telangana
Telangana Shadow Madam Power in the Telangana Government
స్పెషల్ వీడియోలో రేవంత్, మాధవిలతపై సంచలన విషయాలు వెల్లడించింది రాజ్ న్యూస్. ఐఏఎస్ అధికారుల శాఖలు కేటాయించే స్థాయికి ఎదిగారట మాధవి అనే అధికారి. ఇక ఆ మాధవి చెప్పిన వారికే వివిధ శాఖల్లో పోస్టింగులు ఇస్తారని చెబుతున్నారట సీఎంవో అధికారులు. ఆమె చెప్పినట్లే రూల్స్, వీఐపీ ప్రోటోకాల్స్, పోస్టింగులు, బదిలీలు అవుతున్నాయని వెల్లడిస్తున్నారట. Telangana
Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?
రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డితో కలిసి సచివాలయంలో కౌంటర్లు ఓపెన్ చేశారట మాధవి. కనకవర్షం కురిపించే ఫైళ్లను టార్గెట్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్నారట మేడమ్ మాధవి. ఎలాంటి పదవి లేకపోయినా, దేవాలయాల్లో ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తోందట ప్రభుత్వం. రేవంత్‌రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం లేదంటున్నారట సచివాలయ అధికారులు. Telangana
Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించిన దానం నాగేందర్ ?






