Vijay Sales: విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్: ఐఫోన్ 17 మరియు మ్యాక్‌బుక్స్ పై అదిరిపోయే ఆఫర్లు!!

Vijay Sales:ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్ (Vijay Sales) తన ప్రతిష్టాత్మక ‘Apple Days Sale’ ను ఘనంగా ప్రారంభించింది. 28 డిసెంబర్, 2025 నుండి 4 జనవరి, 2026 వరకు కొనసాగే ఈ సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటించింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న 160కి పైగా విజయ్ సేల్స్ రిటైల్ అవుట్‌లెట్లతో పాటు, వారి అధికారిక వెబ్‌సైట్ vijaysales.com లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Vijay Sales Apple Days Sale 2026

ఈ సేల్ లో ప్రధాన ఆకర్షణ లేటెస్ట్ iPhone 17 Series. వీటిపై మొట్టమొదటిసారిగా ఆకర్షణీయమైన ధరలను కంపెనీ అందించింది. ముఖ్యంగా ICICI బ్యాంక్ లేదా ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి Rs. 4,000 వరకు Instant discount లభిస్తుంది. అంతేకాకుండా, పాత ఫోన్లను మార్చుకునే వారికి భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు MyVS లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా అదనపు రివార్డ్ పాయింట్లను పొందే వెసులుబాటు ఉంది.

కేవలం ఐఫోన్లే కాకుండా, కొత్త MacBook Air/M4, iPad Pro మరియు iPad Air మోడల్స్ పై కూడా భారీగా ధరలు తగ్గాయి. విద్యార్థులు మరియు ప్రొఫెషనల్స్ కోసం మ్యాక్‌బుక్స్‌పై ప్రత్యేక డీల్స్ నడుస్తున్నాయి. పాత మోడల్స్ అయిన iPhone 16 మరియు iPhone 15 ధరలు మరింత అందుబాటులోకి వచ్చాయి, ఇవి బడ్జెట్ లో ఐఫోన్ కొనాలనుకునే వారికి మంచి అవకాశం.

యాపిల్ వాచ్ (Apple Watch) మరియు ఎయిర్‌పాడ్స్ (AirPods) వంటి యాక్సెసరీస్ పై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. Tech-lovers తమ ఫేవరెట్ గ్యాడ్జెట్లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు ఈ 8 రోజుల సేల్ ఒక గొప్ప వేదిక. పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Share your love