

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు ఓటర్ లిస్టు తయారు అయిపోయింది. రిజర్వేషన్లతో పాటు వార్డుల డివిజన్ కూడా పూర్తయింది. జనవరి 20వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. Telangana
Telangana Municipal elections BJP – BRS alliance
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ జిల్లాల పర్యటన ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఏకం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Telangana
Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా
గులాబీ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ తో బిజెపి నేతలు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే జనసేన పార్టీతో పొత్తు ఉండబోదని ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రకటన చేశాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Telangana
Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల







