DONALD TRUMP : తాను యుద్ధం ఆపకపోతే పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

DONALD TRUMP : భార‌త్-పాక్ దేశాల మ‌ధ్య అణుయుద్ధం జ‌రుగ‌కుండా ఆపింది తానేన‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియ‌న్ ప్ర‌సంగంలో ట్రంప్ ఈ అంశాల‌ను ప్ర‌స్తావించారు. ముఖ్యంగా భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ మేఘాల‌ను తొల‌గించాన‌ని.. తాను జోక్యం చేసుకోక‌పోయి ఉంటే ఇరు దేశాల మ‌ధ్య పెద్ద యుద్ధం జ‌రిగేద‌ని తెలిపారు. DONALD TRUMP

PAKISTAN PRIME MINISTER WOULD HAVE DIED IF THE HE HAD NOT STOPPED WAR.. TRUMP SENSATION COMMENTS

భార‌త్-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ప్ర‌ధాని కూడా చ‌నిపోయేవార‌ని.. దాదాపు 35 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ పేర్కొన్నారు. తొలి 10 నెల‌ల కాలంలోనే 8 యుద్ధాల‌ను ఆపాన‌ని తెలిపారు. గ‌త ఏడాది మే నెల‌లో ప‌హ‌ల్గామ్ లో ఉగ్ర‌వాదులు చేసిన దాడి త‌రువాత భార‌త్-పాక్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. DONALD TRUMP

Also Read : CM REVANTH REDDY : కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న‌ల్ ట్వీట్..!

యుద్ధం గురించి ట్రంప్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. ఆ స‌మ‌యంలోనే తాను రంగంలోకి దిగి యుద్ధాన్ని ఆప‌కుంటే ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోన‌ని ఇరు దేశాల నేత‌ల‌కు తేల్చి చెప్పిన‌ట్టు తెలిపారు. యుద్ధం ఆప‌కుంటే 200 శాతం టారిఫ్ లు విధిస్తాన‌ని హెచ్చ‌రించ‌డంతో ఇరు దేశాలు శాంతించాయ‌ని వివ‌రించారు ట్రంప్. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. DONALD TRUMP

Also Read : CM REVANTH REDDY : పేదల ఇళ్ల పై కాంగ్రెస్ జేసీబీ

Share your love