

Kavitha: తెలంగాణ రాష్ట్రంలో దేవనపల్లి కవిత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీ పెట్టి దూసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట కవిత. అయితే దీనికోసం భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఏకంగా ప్రశాంత్ కిషోర్ తో డీలింగ్ కుదుర్చుకున్నారట దేవనపల్లి కవిత. తన పార్టీకి కావాల్సిన సలహాలు అలాగే సూచనలు ఇచ్చేందుకుగాను ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది. Kavitha
500 crore deal between Kavitha and Prashant Kishore
సంక్రాంతి పండుగ సందర్భంలో అందరూ హడావిడిగా గడిపితే.. కవిత మాత్రం బీహార్ వెళ్లి ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు.. తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. Kavitha
Also Read: Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?
అంతేకాదు దేవనపల్లి కవిత అలాగే ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ కూడా జరిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువస్తే 500 కోట్ల కాంట్రాక్టు ఇచ్చేందుకు దేవనపల్లి కవిత సిద్ధమయ్యారట. లేదా తన కంపెనీలలో షేర్లు కూడా ఇస్తానని చెప్పారట. దీనికి ప్రశాంత్ కిషోర్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Kavitha
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు





