
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా లీడర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నాడట. శశి థరూర్ ను బిజెపిలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎండాకాలం జరగబోతున్నాయి. Shashi Tharoor
Shashi Tharoor Skips Rahul Gandhi Key Kerala Congress Meet
ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శశి థరూర్ హాజరు కాలేదు. ఆయన బిజెపి మీటింగ్ కు వెళ్లారు. ఈ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. Shashi Tharoor
Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స…కారణం ఇదే!
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ఆయన ప్రసంశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అతన్ని దూరం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో శశి థరూర్ చాలా సీరియస్ గా ఉన్నారట. ఇక ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి వెళ్లడంతో.. త్వరలోనే బిజెపి పార్టీలోకి శశి థరూర్ వెళ్తారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. Shashi Tharoor
Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్కలో వేస్తాం





