

KCR : ఆంధ్రజ్యోతి ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఇకపై అన్ని రకాల గులాబీ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని అధికారిక ప్రకటన చేసింది. కెసిఆర్ ఆదేశాల మేరకు ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొన రాదని స్పష్టంగా పేర్కొంది. KCR
KCR sensational decision on Andhra Jyothi channel
ఇటీవల జరిగిన ఏబీఎన్ టీవీ చర్చలో భాగంగా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ను అవమానించేలా ఆ ఛానల్ కు సంబంధించిన వెంకటకృష్ణ వ్యవహరించారు. గెట్ అవుట్ ఫ్రొం మై ఛానల్ అంటూ ఏబీఎన్ ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ రెచ్చిపోయారు. KCR
Also Read: Telangana: టీ-హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?
ఇక ఈ సంఘటనపై కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారట. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుకు క్షమాపణలు చెప్పాలని వెంకట కృష్ణ పై ఒత్తిడి తీసుకొచ్చారు గులాబీ పార్టీ నేతలు. కానీ చీమకుట్టినట్లు కూడా ఏబీఎన్ ఛానల్ వ్యవహరించలేదు. దీంతో ఆ ఏబీఎన్ ఛానల్ ను బహిష్కరించింది కేసీఆర్ పార్టీ. KCR
Also Read: Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?







