

Jagan: నేడు అంబటి ఇంటికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. Jagan
Former CM YS Jagan Mohan Reddy will visit Ambati’s house today
ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ జగన్. అయితే, జగన్ రాక నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. Jagan
Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెరపైకి కొత్త పంచాయితీ ?
మరోవైపు, వైసీపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. గుంటూరులో పోలీసు 30 యాక్ట్ అమలులో ఉందని ప్రకటించారు పోలీసులు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు ఇచ్చారు. పోలీసు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్… కీలక ఆదేశాలు ఇచ్చారు. Jagan







