

HARISH RAO : తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెలుగుమెట్లలో పేదల ఇళ్లను ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై మంత్రి పొంగులేటి అర్హులైన ప్రతి ఒక్కొరికీ స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని మొన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ పేదల పరిస్థితి మాత్రం అగమ్యఘోచరంగా మారింది. దీనిపై తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే స్పందించారు.
HARISH RAO EXPOSED SCAM OF MINISTER PONGULETI SRINIVAS RAO IN THE NAM OF PROHIBITED LANDS
నిషేదిత భూముల పేరిట మంత్రి పొంగులేటి చేస్తున్న స్కామ్ ని బయటపెట్టారు హరీష్ రావు. పేలని బాంబుల శాఖా మంత్రి నిషేధిత భూముల పేరిట భారీ స్కాం చేస్తున్నాడని పేర్కొన్నారు. నిషేధిత భూముల జాబితా కోటి ఎకరాలకు దాటింది.. దాన్ని ఆన్‌లైన్లో పెట్టండి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాగానే విలువైన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టడం.. వసూళ్లు కాగానే తీసేయడం వంటి చేస్తున్నారని తెలిపారు.
Also Read : KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?
మీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ భూముల విషయం పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు పేద ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పై చాలా ఆగ్రహం గా ఉన్నారు.
Also Read : TELANGANA : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!







